ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలి
- విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
- నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ క్రైం, మే 27:పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా మెలగాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ సేవల అందించాలని, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పె ట్టాలని సిబ్బందిని ఆదేశించారు.స్టేషన్లో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్ట్ డిస్పోజల్ రికార్డులు, వారంట్ అమలు స్థితి ని పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్రైమ్ ప్రాపర్టీ రూమ్లో భద్రపరిచిన కేసువస్తువులు, స్వాధీనం చేసుకున్న సామాగ్రి, వాహ నాల నిర్వహణను తనిఖీ చేసి వాటిని శాస్త్రీ య పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, వాష్ రూమ్లు, మెన్ బ్యారేక్, సిబ్బంది విశ్రాంతి గదులు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి సి బ్బందికి మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కిట్, యూనిఫామ్, ఆయుధాల నిర్వహణ, డ్యూటీ నిర్వహణ తీరు, హాజరు పుస్తకాలను పరిశీలించారు.
శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి , రాత్రి వేళల్లో బ్లూ కోలట్స్, పెట్రోలింగ్ పార్టీలు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచిం చారు. పట్టణంలో రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏ ర్పాటు చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, డ్ర గ్స్, జూదం, అక్రమ మద్యం, ఈవ్టీజింగ్, మై నర్ డ్రైవింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదే శించారు.
మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మహి ళా సంబంధిత ఫిర్యాదులపై వెంటనే స్పం దించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, క్రమశిక్షణతో విధు లు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్ లు ప్రకటించారు.ఈ తనిఖీలో డిఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్బి సీఐ ఆది రెడ్డి, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, 2 టౌన్ ఎస్.ఐ సైదులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






