calender_icon.png 16 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కఠోర సాధనతో లక్ష్యం వైపు ప్రయాణించాలి

15-05-2025 11:58:03 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): లక్ష్య సాధన కోసం కఠోర శ్రమ చేస్తూ, ఉన్నత లక్ష్యాల వైపు ప్రయాణించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(constituency MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ మైదానంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చదువుతోనే మన తలరాతలు మారుతాయని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకొవాలని సూచించారు.

క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. గొప్ప లక్ష్యాలను పెట్టుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. చదువుకునే విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. అనంతరం హార్టికల్చర్ ద్వారా మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిడి అంబాజీ, ఏపీఓ (పివిటిజీ) మెస్రం మనోహర్, పీజీ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భాస్కర్, జిల్లా గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, పిడిలు, కోచ్ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.