calender_icon.png 16 May, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాట సింగారంలో భూ వివాదాలు!

16-05-2025 12:00:00 AM

  1. ఒకే భూమిని పలుసార్లు క్రయవిక్రయాలు
  2. భూ రికార్డులు మార్చి..అడ్డగోలుగా ఆక్రమణలు
  3. నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తూ రాత్రికి రాత్రే బోర్డులు 
  4. స్థానిక అధికారుల తప్పిదాలే భూవివాదాలకు కారణమంటున్న బాధితుల ఆరోపణలు 

అబ్దుల్లాపూర్‌మెట్,15: బాటసింగారం లో భూ వివాదాలు  బాధితులను కంటిమీ ద కునుకు లేకుండా చేస్తున్నాయి. పైసా పై సా పోగేసి  సొంత ఇల్లు  కట్టుకునేందుకు జాగను కొనుగోలు చేస్తే... అట్టి ప్లాట్ల సర్వేనెంబర్ లో  బై నెంబర్లు సృష్టించి భూ కబ్జాదారులు ప్లాట్లను ఆక్రమించి  రాత్రికి రాత్రే బోర్డులో పాతేస్తున్నారు. భూ కబ్జాదారులకు  స్థానిక అధికారుల అండదండలు ఉండడం తో బాధితులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. 

గ్రామ స్థాయి అధికారుల  మొదలుకొని మండల స్థాయి అధికారులు తప్పిదాలతో సిటీ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో భూవివాదాలు తలెత్తుతున్నాయి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.  ఇక్కడ ఉన్న భూములను గతంలో విక్రయించినప్పటికి తిరిగి ఆ భూములకు అధికారులు హక్కులు కల్పించడంతో సమస్యలు మొదలై వివాదాలకు దారితీస్తు న్నాయి.

దీంతో తమ వారస్వతంగా  వచ్చిన భూములతో పాటు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ల వరకు ఆక్రమణదారులు నకిలీ డాక్యుమెంట్లు సృ ష్టించి రాత్రికి రాత్రే బోర్డులు మార్చేస్తున్నా రు. ఇంతటితో ఆగకుండా నిర్మాణాలను కూల్చి.. భయబ్రాంతు లకు గురిచేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అక్రమార్కుల దర్జాగా కబ్జాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

దీనికి కారణం తాజా మాజీ ప్రజాప్రతినిధులేనని అన్నారు. దీంతో స్థానికులు సతమతమౌతున్నారు. వివరాల్లోకి  వెళ్లితే.. అబ్దుల్లాపూర్‌మెట్ మం డలం బాటసింగారం  సర్వే నెం బర్ 7లో ఏమీ ఎప్పుడు ఏమీ జరుగుతుందోనని బాధితులు ఆందోళనలు చెందుతు న్నారు.

ఇదే గ్రామానికి చెందిన 23 మందికి  3.21 ఎకరాల -భూమిని 1991లో ఎంఏ రహ్మన్ తండ్రి మౌలానకు సెల్ డీడ్ చేశారు. ఆ తర్వాత రహ్మన్ ను శిల్ప రియల్ ఎస్టేట్ సంస్థకు 1998 జీపీఏ చేసి.. 1999లో పాట్లను విక్రయించారు. 1999 నుంచి 2023 వరకు క్రయ విక్రయాలు శిల్ప లేవుట్‌లో జోరుగా జరిగాయి.

ప్లాట్లకు.. 2023లో పాసుబుక్కులు

రహ్మన్ 1998లో శిల్ప రియల్ ఎస్టేట్స్ సంస్థకు జీపీఏ చేసి.. శిల్ప లే అవుట్ చేసి ప్లాట్లను విక్రయించిన తర్వాత  కూడా రెవెన్యూ రికార్డు రహ్మన్ పేరు కొనసాగుతుండడంతో బాటసింగారం గ్రామానికి చెందిన కొంత మంది రాజకీయ పార్టీల నాయకులు మళ్లీ తెరపై రహ్మన్ తీసుకొచ్చారు. 2023లో మళ్లీ పాసుబుక్కులు పొందినట్లు స్థానికులు తెలిపారు.

రహ్మన్ చనిపోయిన తర్వాత పొజిషన్‌లోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీఏ రద్దు చేయకుండా.. మళ్లీ పట్టా పాసుబుక్కలు ఎలా ఇస్తారని ప్లాట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇది ఇలా ఉంటే.. బాటసింగారం సర్వే నెంబర్ 7 అనుకొని 10/41 ప్రభుత్వ భూమి ఉండగా.. గతంలో పేదలకు అసైన్డ్ చేసింది. వీరిలో కొంత మంది గత ప్రభుత్వం హయాంలో 59 జీవో ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో రికార్డులు పరిశీలించి వారికి రెగ్యులరైజేషన్ చేసింది.

వీరిని కూడా వదలకుండా  మీ పొజిషన్ ఇక్కడ రాదు.. మీరు ఉన్న పొజిషన్ సర్వే నెంబర్ 7కు సంబంధించిన భూమిని బెదిరిస్తున్నారని వారు వాపోయారు.  10/41లో ఉన్న నిర్మాణాలను కూడా రాత్రికి రాత్రే కూల్చివేసి.. కబ్జాలకు దిగుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరి కొంత ఇక్కడ ఉన్నది పట్టా భూమికాదని.. భూదాన్ భూమిని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 

న్యాయం జరిగే వరకు పోరాడుతాం..

సర్వే నెంబర్ 10/41లో గతంలో మా కు టుంబానికి ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో 59 జీవో కింది దరఖా స్తు చేసుకోగా..  అధికారులు పరిశీలించి మా కు 500 గజాలను రిజిస్ట్రేషన్  చేసింది. 20 23లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే..

ఇప్పు డు కొంతమంది వచ్చి ఇదీ బెదిరిసుండ్రు. మేము కోర్డు సంప్రదించి.. మా పొజిషన్‌పై ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా.. మా నిర్మాణాలను కూల్చివేసిండ్రు. మమ్మల్ని -భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదీ ఏమైనా మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. 

                                                                                                                                                                      పుల వెంకటేశ్, బాధితుడు బాటసింగారం గ్రామం

కోర్డు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం

బాటసింగారం గ్రామ సర్వే నెంబర్ 7లో 3.21 ఎకరాల పట్టా భూమి ఉంది. గతంలో లే అవుట్ లో ప్లాట్ల క్రయ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సర్వే నెంబర్ లో భూమి వివాదాలు ఉండడం తో ఇరువర్గాల కు చెందిన వారు కోర్టు ను ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో పరిశీలించి కోర్టు ఆదేశాలకు మేరకు చర్యలు తీసుకుంటాం.

 సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ అబ్దుల్లాపూర్‌మెట్