2 May, 2026 | 2:20 PM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

02-05-2026 01:33 PM

బాలల సంరక్షణ అధికారి మహేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించగా, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రవికుమార్ డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యలను వివరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు డ్రగ్ వ్యసనం నివారణలో కౌన్సిలింగ్, కుటుంబ మద్దతు ప్రాధాన్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ పద్మ  విద్యార్థులతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.