రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, మే2,(విజయ క్రాంతి): రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ, రైతుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల శాఖ సహకారంతో ఐకెపి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కడ్తాల్ మండల అధ్యక్షులు బిచ్య నాయక్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమనగల్లు మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ గుడూరు భాస్కర్ రెడ్డితో ప్రారంభించారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ... రైతులు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కోరారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 ప్రభుత్వం బోనస్ అందిస్తుందని చెప్పారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు రైతులకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగన నిలిచిందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనన్నారు.
ఈ కార్యక్రమంలో పీ సీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి బాలాజీ సింగ్,డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, ఆమన్ గల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా, కడ్తాల్ పట్టణ సర్పంచి రాయికంటి బిక్షపతి, ఉపసర్పంచి యాదగిరి రెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు, మార్కెట్ డైరెక్టర్ తాళ్ల రవీందర్, వార్డు సభ్యులు భాను కిరణ్, పీఎసీఎస్ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు చందోజి, జహంగీర్ బాబా, జాంగిర్ అలీ, వెంకట్ రెడ్డి, దారెడ్డి అంజన్ రెడ్డి, రాములు, బిక్షపతి, ఏపీఎం రాములు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






