18 August, 2026 | 8:21 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

18-08-2026 07:44 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి,(విజయ క్రాంతి): బహుజన రాజ్య స్థాపన, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక అసమానతలు, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా 17వ శతాబ్దంలోనే పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని కొనియాడారు.  ఎల్లమ్మ దేవాలయం ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని తెలిపారు.

కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.