22-08-2025 08:41:40 AM
అమరావతి: యానాం సమీపంలో దరియాలతిప్ప వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఐలాండ్-3 వద్ద ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్(ONGC gas pipeline) లీకై భారీగా మంటలు చెలరేగాయి. సముద్రంలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో సరఫరా నిలిపివేయడంతో శుక్రవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది పేర్కొన్నారు.