22-08-2025 02:11:04 AM
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాష్ర్ట నీటిపారుదల శాఖ సలహా దారుడిగా మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిష్టానుతుడైన హార్పల్ సింగ్ భారత సైన్యంలో నా లుగు దశాబ్దాలకు పైచిలుకు విశిష్ట సేవలు అందించారు.
దేశ సరిహద్దులలో రహదారుల సంస్థలో డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించడంతో పాటు భారత సైన్యం ఇంజినీర్ ఇన్‌చీఫ్‌గా ముఖ్య భూమిక పో షించారు. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌గా విధు లు నిర్వహిస్తున్న సమయంలో రోహ్తంగ్ పాస్ కింద అటల్ టన్నెల్, అరుణాచల్ ప్ర దేశ్‌లో సెల అండ్ నేచివ్ టన్నెల్‌ల నిర్మాణాలు ఆయన ఆధ్వర్యంలో విజవంతమ య్యాయి. హిమాలయాల ప్రాంతంలో అత్యంత క్లిష్టతరమైన భౌగోళిక పరిస్థితిల ను అధిగమించి సొరంగాలను నిర్మించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
సొరంగాల నిర్మాణంలో అపార అనుభవం
సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన హార్పల్ సింగ్ అమెరికాలోని ప్రసిద్ధి చెంది న విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత చదువులు పూర్తి చేశారు. అపార అనుభవంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో గౌరవప్రదమైన విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా, భారత ఇనిస్ట్యూషన్ ఆఫ్ సివిల్ ఇం జినీర్స్ ఉపాధ్యక్షుడిగా, ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్రిడ్జి ఇంజినీర్స్ చైర్మన్‌గా, ఇం డస్ట్రీ కన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.
సొరంగమార్గాల నిర్మాణంలో ఆ యనకు అపార అనుభవం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నీటిపారుదల శాఖ చేపడుతున్న సొరంగాల నిర్మా ణాలను వేగవంతం చేయడంతో పాటు సొరంగ మార్గాల ఏర్పాటులో ఎదురయ్యే సాంకేతిక సమస్యల నివారణలో ఆయనకున్న సాంకేతిక నైపుణ్యాలను గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం ఈ నియామకం చేసింది.
రాష్ర్ట నీటిపారుదల శాఖను ఆధునిక పరిజ్ఞానం వైపు నడిపించడంతో పాటు అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకుగాను ఈ నియామకం చేపట్టింది.
ఇప్పటికే డిజైన్ విభాగం పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడంతో పాటు వివిధ విభాగాల లో నిపుణుల నియమకాలను చేపట్టి నీటిపారుదల శాఖను బలోపేతం చేస్తున్న నేప థ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పనులను వేగవంతం చేస్తున్న ఆ శాఖకు ఈ నియామకం ఖచ్చితంగా ఓ మైలురాయిలా నిలిచి పోతుంది. తద్వారా నీటిపా రుదల శాఖ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవడానికి హార్పల్ సింగ్ నియామకం తోడ్పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.