11 March, 2026 | 1:10 AM

తల్లి బిడ్డలను క్షేమంగా కాపాడిన 108 సిబ్బంది

10-03-2026 09:40 PM

108 సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల స్రవంతి  పురిటి నొప్పులు రావడంతో 108 కి సమాచారం ఇచ్చారు అంబులెన్స్ సిబ్బంది రాత్రి 1:30 మంగళవారం అన్నారం చేరుకొని, స్రవంతి దగ్గరికి వచ్చేసరికి డెలివరీ అవుతుంది మగ శిశువు బొడ్డుతాడు మెడకు వేసుకొని 2:14  జన్మించాడు. పుట్టిన శిశువుకు చలనం లేక బొడ్డుతాడు బిగిసుకుని కాళ్లు చేతులు మొఖం చలనం లేదు.

పల్స్ బ్రీతింగ్ ఏడుపు లేదు. మెడకు ఉన్నటువంటి బొడ్డుతాడు రిమూవ్ చేసి శిశువుకు సిపిఆర్ స్టార్ట్ చేసి 108 టెక్నికల్ సిబ్బంది వెంకట్ రాములు పైలెట్ నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించి డాక్టర్ శివ పర్యవేక్షణలో శిశువుకు ప్రాణం పోశారు. 108 సిబ్బంది  తల్లి బిడ్డను క్షేమంగా సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వారి కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు 108 సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.