20 May, 2026 | 2:50 AM

కొనసాగుతున్న పుణ్యస్నానాలు

09-02-2025 01:23 AM

ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య ఇప్పటికే 40 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్సవం ఇంకా 18 రోజుల పాటు జరగనుంది. పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య 50 కోట్లు అలవోకగా దాటనుందని పలువురు అంచనా వేస్తున్నారు. శనివారం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో కలిసి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పుణ్యస్నానమాచరించారు.