15 April, 2026 | 11:05 AM

అల్వాల్‌లో యూకో బ్యాంక్ ప్రారంభం

29-10-2025 01:28 AM

కొత్త శాఖను ప్రారంభించిన డీజీఎం శ్రీకాంత్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అల్వాల్‌లో యూకో బ్యాం క్ కొత్త శాఖను తెలంగాణ జోన్ డీజీఎం, జోనల్ మేనేజర్ ఎన్ శ్రీకాంత్ మంగళవారం ప్రారంభించారు. ఇది తెలంగాణాలో యూకో బ్యాంక్ 46వ శాఖ. స్థానిక వ్యాపారులు, బిల్డర్లకు ఉత్తమ కస్టమర్ సేవలను అందించడానికి, ఆర్థిక సౌకర్యాలను అందించడానికి ఈ ప్రాంతంలో ఈ శాఖ ప్రారం భించబడింది. ఈ సందర్భంగా ఎన్ శ్రీకాంత్ ప్రసంగించారు.

పరిశ్రమలో అత్యల్ప వడ్డీ రేట్లతో బ్యాంకు యొక్క వివిధ పథకాల గురించి వివరించారు. యూకో బ్యాంక్ ఉత్తమ కస్టమర్ సేవను అందించడానికి కట్టుబడి ఉందని, యూకో బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అత్యధిక రేటింగ్ పొందిన యాప్ అని కూడా వివరించారు. అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ ఎ భరత్ చంద్ర మాట్లాడుతూ.. అల్వాల్ ప్రజలకు ఆర్థిక సలహాదారుగా సహాయకారిగా ఉంటారని హామీ ఇచ్చారు.