17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

సమ్మె తేదీ మాత్రమే వాయిదా.. కార్మికుల పోరాటం కాదు

17-05-2025 12:00 AM

టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి

హుజూర్ నగర్, మే 1౬: జాతీయ కార్మిక సంఘాలన్నీ మే 20న సమ్మె చేయాలని నిర్ణయించగా,భారత్ పాకిస్తాన్ ల మధ్య ఘర్షణల నేపథ్యంలో సమ్మె ను మాత్రమే వాయిదా వేయడం జరిగిందని,జులై 9న సమ్మె ఉంటుందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి అన్నారు.

హుజూర్నగర్ లో రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావుకి,వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్ప కి సమ్మె నోటీస్ లను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మె మాత్రమే వాయిదా పడిందని పోరాటం కాదనే విషయాన్ని కార్మికులంతా గుర్తుంచుకోవాలన్నారు.

రైస్ మిల్ డ్రైవర్లు,హమాలీలు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్టిసి నాయకులు రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు గుండె పోయిన ఎంకన్న యాదవ్ దిన కూలీల యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి స్వరూప సుకన్య కోటమ్మ రామయ్య తదితరులు పాల్గొన్నారు.