18 April, 2026 | 10:31 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

డీపీఎస్‌ఈ చేసినవారే ప్రీప్రైమరీకి అర్హులుగా ప్రకటించాలి

01-06-2025 12:00 AM

మంత్రి పొంగులేటికి అభ్యర్థుల విన్నపం

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): నూతన విద్యా విధానం ఎన్‌సీటీఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఏర్పాటు చేసే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్/ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో, త్వరలో వేయబోయే డీఎస్సీలో ప్రీ ప్రైమరీ టీచర్లుగా రెండు సంవత్సరాల డిప్లొ మా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సు పూర్తిచేసిన వారినే నియమించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

సంఘం వైస్ ప్రెసిడెంట్ జాదవ్ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఆకుల సురేశ్ రాష్ట్ర రెవెన్యూ, పౌర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు.