06-12-2025 08:25:44 PM
మీనాక్షి నటరాజన్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపుమేరకు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆమెను కలిసారు. హైదరాబాద్ లో శనివారం ఆమెను కలిసిన నేపథ్యంలో జిల్లా రాజకీయాలు, అభివృద్ధిపై పలు అంశాలపై చర్చించారు. గత 25 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ప్రజా సమస్యలపై పోరడుతూ పార్టీ కోసం పని చేస్తున్న తనకు పార్టీలో సమూచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేయాలని సూచించారని, పార్టీ కోసం పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు.