calender_icon.png 7 December, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

06-12-2025 08:29:25 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతిల సర్పంచ్, వార్డు సభ్యలకు జరిగే ఎన్నికలలో పాల్గొనే  ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 11 న జరగబోవు 2వ సాధారణ ఎన్నికల దృష్ట్యా  శనివారం స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో  రెండవ విడుత శిక్షణా తరగతులను, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి సేకరణ, ఓటింగ్ కార్యవిధానం గురించి రిటర్నింగ్ అధికారుల ఎన్నికల కార్యవిధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.వో కే. సరోజ, తహసిల్దార్ ఎ.దిలీప్ కుమార్, శిక్షకులు తిరుపతి లు పాల్గొన్నారు.