calender_icon.png 9 June, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకు రెండు కప్పులు మాత్రమే

08-06-2025 12:00:00 AM

టీకి సాటి టీనే ఉదయమైనా.. సాయంత్రమైనా.. వేడి వేడి టీ తాగుతుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాదు శరీరానికీ చాలా లాభాలున్నాయి. మన దేశంలో టీ ప్రియులు చాలామందే ఉన్నారు. చాలా వరకు కప్పు వేడి వేడి టీతో చాలా మందికి ప్రతి ఉదయం ప్రారంభం అవుతుంది. ఇలా రోజు మొత్తంలో పలుమార్లు టీ రుచులు ఆశ్వాదిస్తుంటారు. పాలతో టీ తాగడానికి అధిక శాతం ఇష్టపడతారు.

కానీ ఒక రోజులో ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీ అధికంగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలో నిపుణులు చెబుతున్నారు. రోజులో ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల టీ తాగడం మంచిది. కానీ అంతకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. టీలో కెఫిన్ ఉంటుంది.

దీన్ని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలు, చక్కెర కలిపిన టీ తాగే వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి క్షీణించడం, బరువు పెరగడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఎక్కువగా టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శాతం కూడా తగ్గుతుంది. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అందువల్ల రోజుకు రెండు కప్పుల టీ తాగడం శ్రేయస్కరం. హెర్బల్ లేదా గ్రీన్ టీ మరీ మంచిది.