08-06-2025 12:00:00 AM
కంటిని ఇంపుగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతో కష్టపడి ఐ-లైనర్ పెట్టుకుంటాం. అయితే రోజంతా ఐ-లైనర్ అలాగే నిలిచి ఉంటుందా అంటే.. కష్టమే అని చెప్పాలి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇది సాధ్యమేనంటున్నారు నిపుణులు. అవేంటంటే..
* ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకునే క్రమంలో కళ్లు, కనురెప్పల చుట్టూ కూడా అప్లు చేసుకొని.. ఆపై ఐ-లైనర్ పెట్టుకుంటుంటారు చాలామంది. అయితే దీనివల్ల ఐ-లైనర్ త్వరగా చెదిరిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి కళ్లకు ఐ-లైనర్ పెట్టుకోవాలనుకుంటే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసుకోకపోవడమే మంచిది.
* పదే పదే ముఖం శుభ్రం చేసుకోవటం, చెమట పట్టడం వల్ల కూడా ఐ-లైనర్ ఎక్కువ సమయం నిలిచి ఉండదు. అలాంటప్పుడు వాటర్ ప్రూఫ్ లేదా జెల్ తరహా ఐ-లైనర్ ఎంచుకోవడం మేలు.
* అద్దీ అద్దనట్టుగా కొద్దిపాటి పౌడర్ని ఉపయోగిస్తే ఐ-లైనర్ మెరుపు తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే ముందు పౌడర్ రాసుకొని ఆపై ఐ-లైనర్ అప్లు చేసుకున్నా ఫలితం ఉంటుంది.
* ముఖానికి మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ ఎలాగైతే రాసుకుంటామో.. ఐ-లైనర్ పెట్టుకోవడానికి ముందు కూడా ఐ ప్రైమర్ అప్లు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే అది కూడా తక్కువ మొత్తంలో రాసుకుంటే ఐ-లైనర్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
* ఐషాడో కూడా ఐ-లైనర్ ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు సహకరిస్తుంది. ఈ క్రమంలో ఐడూ వేసుకోవడం పూర్తయ్యాక.. బ్రష్ సహాయంతో కనురెప్పలపై షాడోని పైపైన తీర్చిదిద్దితే సరిపోతుంది.
* ఐ-లైనర్ అప్లు చేసుకున్న తర్వాత ఫైనల్గా కన్సీలర్తో టచప్ ఇచ్చినా చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.