calender_icon.png 13 May, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం...

13-05-2025 05:44:53 PM

66వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్..

హనుమకొండ (విజయక్రాంతి): వడ్డేపల్లి జిఎంఆర్ అపార్ట్మెంట్ ఎదురుగా దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్(Corporator Dasyam Abhinav Bhaskarప్రారంభించారు. తదనంతరం మాట్లాడుతూ... ఎండాకాలం ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారిలకు దాహార్తి తీర్చేందుకు, అలాగే వడ్డేపల్లి ప్రాంత ప్రజలకు, అపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు రోకుల సతీష్, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బిజెపి నాయకులు రామరాజు, సాగర్ గౌడ్, విద్యాసాగర్, రాజు, సతీష్, అరవింద్, భరత్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రమేష్, కాలనీ వాసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.