1 July, 2026 | 11:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలి

10-06-2025 12:19 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూన్ 9 (విజ య క్రాంతి):కాకతీయ విశ్వవిద్యాలయంలో  కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన  రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆదివాసి గిరిజన బిడ్డలపై ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారత ప్రాంతాల్లోని అమాయకపు ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ సమర్ధిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూన్నామని చెప్పారు. ఆపరేషన్ కాగర్ తక్షణం నిలిపివేయాలని అన్నారు. 

టిపిసీసీ అధికార ప్రతినిధి కుచన రవళి, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, యూనివర్సిటీ విద్యార్థి విభాగ నాయకుడు అలువాల కార్తీక్, యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్ చందర్, భరత్ బచావో వెంగళ్ రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు శ్రవణ్, మహేష్ , క్రాంతి, భువన్, శివ, మనోహర్, సనత్ జయసూర్య, మనోహర్, శరత్, జున్ను రాజు, అరూరి రంజీత్, హతి రామ్ తదితరులు పాల్గొన్నారు.