1 July, 2026 | 10:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పెళ్లి కుటుంబంలో విషాదం

10-06-2025 12:20 AM

తాళికట్టిన గంటలోపే వరుడు మృతి 

జహీరాబాద్, జూన్ 9 : జహీరాబాద్ పట్టణంలో జరిగిన ఓ పెళ్లిలో విషాదం చోటుచేసుకుంది పెళ్లి అయిన గంటలోపే వరుడు కుప్పకూలి పడిపోవడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికీ వరుడు మృతి చెందిన విషాదకర సంఘటన ఇది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలానికి చెందిన చీలమామిడి గ్రామ నివాసి అయిన పెద్ద గొల్ల రాములు కుమారుడు పెద్ద గొల్ల నాగరాజుకు ఆదివారం జహీరాబాద్ లోని శంకర్ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు వరుడు వధువు మెడలో తాళి కట్టిన కొద్దిసేపటి తర్వాతే వరుడు నాగరాజు స్పృహ తప్పి పడిపోయాడు.  కుటుంబ సభ్యులు ఆయనను జహీరాబాద్ లోని బాలాజీ హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తీసుకె ళ్లారు. కేర్ ఆస్పత్రి డాక్టర్లు పరిశీలించి బ్రెయి న్లో నరాలు చిట్లి పోయాయని, బతకడం కష్టమని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును గాంధీ ఆసుపత్రికి తరలించా రు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. నాగ రాజు కుటుంబం  ప్రస్తుతం జహీరాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉంటున్నారు. ఎస్త్స్ర కాశీనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.