29 March, 2026 | 1:59 AM

ఆపరేషన్ నార్కోస్ విజయవంతం

29-03-2026 12:26 AM

రూ.30 లక్షల విలువైన 60.9 కిలోల గంజాయి స్వాధీనం

సికింద్రాబాద్,మార్చి28 (విజయక్రాంతి): రైల్వే మార్గాల ద్వారా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సికింద్రాబాద్ విభాగం మరోసారి విజయాన్ని సాధించింది. ఆపరేషన్ నార్కోస్‌లో భాగం గా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రూ.30 లక్షల విలువైన 60.9 కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే&మార్చి 27న సికింద్రాబాద్‌బేగంపేట రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న 11020 కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఆర్పీఎఫ్ బృందం డికాయ్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రైలు వెనుక భాగంలోని జనరల్ కోచ్లో సీట్ల కింద యజమాన్యం లేని 7 సంచులు కనిపించాయి.

ప్రయాణికులను అడిగినా ఎవరూ వాటిపై హ క్కు చెప్పలేదు. సందేహంతో ఆ సంచులను తనిఖీ చేయగా, వాటిలో వివిధ పరిమాణాల్లో 31 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. మొత్తం బరువు 60.9 కిలోలు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ.30 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. స్వాధీ నం చేసిన గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించి, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో ఎన్‌డిపిఎస్  చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చర్యలు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అలకుంట నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి.

ఆయన మాట్లాడుతూ, 2025లో 99 కేసుల్లో రూ. 6.73 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 119 మందిని అరెస్ట్ చేశాం. 2026లో ఇప్పటివరకు 14 కేసుల్లో రూ.1.15 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 20 మందిని పట్టుకున్నాం అని తెలిపారు. మాదకద్రవ్యాలు యువత ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్ర మాదకరమైనవని, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతా యని ఆయన హెచ్చరించారు. రైల్వే ప్రయాణికులు అనుమానాస్ప ద వస్తువులు కనిపించిన వెంటనే 139 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని ఆర్పీఎఫ్ అధికారులు కోరారు.