14 July, 2026 | 4:51 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

30-07-2024 01:26 AM

రెండు రోజులు వర్షాలు

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ కేంద్రం ప్రకటించింది. మంగళ, బుధవారాల్లో వర్షాలు పడుతాయన్న వాతావరణ కేంద్రం.. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం వనపర్తిలో భారీ వర్షం కురవ గా, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములు గు, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలప ల్లి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబా ద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జనగా మ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.