మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీల నిర్వహణ
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, మార్చి 5: టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగినుల కోసం వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులతో కలసి కలెక్టర్ క్యారం, చెస్ వంటి క్రీడలను ఆడి అందరిని ప్రోత్సహించారు.
మహిళలలో ఐక్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందించేందుకు ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినుల కోసం షటిల్ బ్యాడ్మింటన్, మ్యూజికల్ చైర్, క్యారం, చెస్ తదితర క్రీడలను నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ మరియు జిల్లా కార్యదర్శి వేల్పూరు రవి ఆధ్వర్యంలో జరిగింది.
రాష్ట్ర మహిళా కార్యదర్శి నిర్మల రాజ కుమారి, సుధామణి సమన్వయంతో కార్యక్ర మం ఘనంగా జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి రంగంలో మహిళలు ముందుకు రావాలని వారు పేర్కొన్నారు. ఈనెల 9న బ హుమతులు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి టీఎన్జీవోస్ సంఘం అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, హెచ్ డబ్ల్యూఓ రాష్ట్ర ఫోరమ్ అధ్యక్షులు భాస్కర్, పంచాయతీ సెక్రెటరీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బలరాం, ప్రమోద్, సుధారాణి, నాగమణి, పద్మ, నర్సింలు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశం, యాదవ రెడ్డి, కృష్ణ, షకీల్ విజయ్ కు మార్, రమేష్, నాగేశ్వరరావు, జగన్, వెంకట్, సాయి నాల్గవ తరగతి సంఘ అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్, నాగరాజు, వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




