24-04-2025 12:41:31 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 23: ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం విద్యార్థులు సత్తా చాటారు. ప్రశాంత్ 98.2 సాధించి, రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాడు. ఎన్.ప్రశాంత్ హస్తినాపురంలోని శ్రీవిద్యా జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు.
ఆర్.ఈశ్వర్(98.2) దిల్ సుఖ్ నగర్ లోని ఐడియల్ జూనియర్ కళాశాలలో, ఎం.స్టీవన్(93) బీఎన్ రెడ్డి లోని ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాలలో, కె.విఘ్నేశ్ (90) శ్రీ విద్యా జూనియర్ కళాశాలలో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ మాట్లాడుతూ... ఉత్తమ ఫలితాలు సాధించిన నలుగురు విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చిన శ్రీ విద్య, ఐడియల్, ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. అనాథ విద్యార్థి గృహoలో పద్ధతిగా ఉంటూ, అహర్నిశలు శ్రమించి ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు రాజేశ్ శుభాకాంక్షలు తెలిపారు.