లోక కళ్యాణార్థం.... లక్షకుంకుమార్చన
శివాలయం లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు....
సుల్తానాబాద్, (విజయ క్రాంతి): లోకాన్ని పాలించే లలితాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని లోక కళ్యాణార్థం లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అర్చకులు వల్లకొండ మఠం రమేష్ శైలజ దంపతులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శ్రీ శివాలయంలో లలిత మాత కుంకుమార్చన కార్యక్రమం లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భం గా అర్చకులు రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం సంవత్సరం లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు.. ప్రతి నెలలో ఒక మంగళవారం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని వంద మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, లలిత సహస్రనామాలు చదువుకుంటూ... శ్రీ మాత్రే నమః అంటూ పూజలు చేస్తారు.
ఇప్పటివరకు రెండు నెలలు పూర్తయిందని అన్నారు, ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేయటం ద్వారా ఆ లలితాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయని తెలిపారు, 2027 ఫిబ్రవరి వరకు ఈ లక్ష కుంకుమార్చన పూర్తి చేయడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త అల్లంకి ఆనందం (నందన్న), డైరెక్టర్ దూడం లింగమూర్తి , పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు బాదం వాణి, పుర ప్రముఖులు, శివాలయం డైరెక్టర్లు, భక్త బృందం, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...




