24-04-2025 12:40:33 AM
ఉగ్ర దాడికి నిరసనగా ఖమ్మంలో కొవ్వొత్తులతో ర్యాలీ
పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : -సైనిక దుస్తుల్లో వచ్చి ముస్లింలా, కాదా అని నిర్దారించుకొని మరీ హత్యాకాండకు పాల్పడటం ఉగ్రవాదుల పిరికిపంద చర్యకు నిదర్శనమని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో విహారానికి వెళ్లిన 26మంది హిందువులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకొవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లురి కొటేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మయురి సెంటర్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించి అక్కడ పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్బంగా నెల్లురి కొటేశ్వరావు మాట్లాడుతూ ఇది యుద్ధం కాదు& ఇది మతంపై, మానవత్వంపై, శాంతిపై విరూపమైన దాడి. అమాయక హిందూ పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపిన విధానం పైశాచికం. ఉగ్రవాదుల ఈ పాశవిక చర్య మానవ చరిత్రలో మచ్చలేని ముద్రగా నిలవనుంది, అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం శాంతి, సంస్కృతి, సహనానికి నిలయమైన దేశం. ఇలాంటి దాడులు మన విలువలకు సవాళ్లుగా మారుతున్నాయి. ప్రజలంతా ఐక్యంగా నిలబడి ఈ అసూర శక్తుల్ని ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రతి పౌరుడు ఈ ముప్పును సీరియస్గా తీసుకోవాలి, అంటూ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లు , జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, తొడుపునూరి రవీందర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు టేకుమట్ల వీర గౌడ్, ఓబీసీ మచ్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సుధాకర్, బోయిన్పల్లి చంద్రశేఖర్ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కందుల కృష్ణ , జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూకే శ్యామ్ సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.