18 March, 2026 | 2:26 PM

రైతులకు ప్రకృతి వ్యవసాయ గిట్ల పంపిణీ

18-03-2026 12:30 PM

మునిపల్లి(విజయక్రాంతి): జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పకృతి వ్యవసాయ గిట్లను జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్,  రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంపై  రైతులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని తెలిపారు.  అలాగే రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ సత్యనారాయణ, ఏడిఏ టెక్నికల్ శ్రీదేవి, ఏవో టెక్నికల్ ప్రేమ, అరణ్య ఫార్మ కల్చర్ ఎన్జీవోస్ ప్రతినిధి పద్మ, ఏవో అనిత రెడ్డి, పోల్కంపల్లి గ్రామ సర్పంచ్ వీరేశం, బుదేరా గ్రామ సర్పంచ్ మల్లేశం, వ్యవసాయ విస్తీర్ణ అధికారి తదితరులు పాల్గొన్నారు.