calender_icon.png 14 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్‌పోర్ట్‌లో మన సంస్కృతిని ప్రతిబింబించాలి

07-05-2025 12:00:00 AM

- పూవులు తోరణాలతో కళకళలాడాలి

- ‘మిస్ వరల్డ్’ ఈవెంట్ అతిథులకు ఘనస్వాగతం పలకాలి

-రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్’ అతిథులకు ఘన స్వాగతం పలకాలని సూచించారర. మంగళవారం ఆయన ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించారు. జీఎంఆర్ ప్యాసింజర్, పర్యాటక, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్‌ఎప్ అధికారులను సమీక్షించారు.

విమానాశ్రయాన్ని అం దంగా ముస్తాబు చేయాలని, ఎక్కడ చూసి నా పూలు, మామిడి, అరటి తోరణాలు కనపడాలని సూచించారు. స్వాగత బృందాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. సమీక్ష అనంతరం మంత్రి అప్పుడే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్‌కు స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

మరికొందరి అందగత్తెల రాక..

మిస్ వరల్డ్ పోటీల కౌంట్‌డౌన్ మొదలవడంతో హైదరాబాద్‌కు వచ్చే విదేశీ అతిథుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. తాజాగా మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్, మిస్ ఫ్రాన్స్ అగధా లో కాయట్ చేరుకున్నారు. వారికి ఎయిర్‌పోర్ట్ బృందం సాదర స్వాగతం పలికింది.

హైదరాబాద్ బిర్యానీకి నేను ఫిదా: మిస్ ఇండియా నందిని గుప్తా

హైదరాబాద్ బిర్యానీ, చాయ్‌కి తాను ఫిదా అని మిస్ ఇండియా నందిని గుప్తా వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె అనంతరం ఓ హోటల్‌లో కాసేపు మీడియా చిట్‌చాట్ చేశారు. తెలంగాణలోని కట్టడాలు చూసేందుక తాను ఉవ్విళ్లూరుతున్నానని, రాష్ట్ర చరిత్ర కూడా తెలుసుకోవాలని ఉందని వెల్లడించారు. నగరం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఆమె సంభాషణంతా తెలుగులో సాగడం విశేషం.

సామాజిక బాధ్యతను పెంచే ఈవెంట్: నటుడు సోనూసూద్

మిస్ వరల్డ్ పోటీలటే కొందరు కేవలం అందాల పోటీలని అనుకుంటున్నారని, ఇది సామాజిక బాధ్యతలు కూడా గుర్తుచేసే కార్యక్రమమని ప్రముఖ నటుడు సోనూసూద్ అభిప్రాయపడ్డారు. పోటీలకు ప్రాతిని థ్యం వహించేందుకు మంగళవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. మంత్రి జూప ల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్  ఈవెంట్ సంస్థ సీఈవో జూలియా మోర్లీ, మిస్ ఇం డియా నందిని గుప్తాతో కలిసి  మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈవెంట్ బ్రెస్ట్ క్యాన్స ర్‌పై ప్రజలకు అవగాహన పెంచేందుకు దోహదపడుతుందన్నారు. తనకు తెలుగు చిత్రపరిశ్రమ ఎంతో ప్రత్యేకమన్నారు.