calender_icon.png 13 May, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్‌మిల్లు దినసరి కూలీ రేట్లు పెంపు

07-05-2025 12:00:00 AM

టీఎన్‌టీయూసీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి 

హుజూర్ నగర్, మే  6: హుజూర్ నగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో దిన కూలీల సంఘాలు మిల్లర్స్ యాజమాన్యం తో సుదీర్ఘంగా జరిగిన చర్చలలో కార్మికుల కూలి పెరిగాయని, గతంలో పగలకూలి రూ 500 ఉండగా ఇప్పుడు రూ 570, రాత్రి కూలి రూ 580 ఉండగా ఇప్పుడు రూ 650 పెరిగినాయిని టిఎన్టియుసి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు.

వీటితోపాటు బోనస్ ఆదివారం సెలవు రోజుల్లో పనిచేసిన చో అదనంగా 40/రూ లు ఇచ్చుటకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుటకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపినారు. కూలి రేట్లు పెంచుటకు అంగీకరించిన యాజమాన్యానికి కార్మిక సంఘ ప్రతినిధులకు కార్మికులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

చర్చల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలిశెట్టి లక్ష్మీ నరసింహారావు,గెల్లి అప్పారావు,ఈగ కోటేశ్వరరావు,కార్మికుల ప్రతినిధులు శీతల రోషపతి, గుండెబోయిన వెంకన్న యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్, దిన కూలీలు,యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సాముల కోటమ్మ,అమరవరపు స్వరూప,మున్ని,సుకన్య, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.