06-12-2025 11:25:40 PM
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): అభివృద్ధి పనుల్లో భాగంగా శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 31వ డివిజన్ హంటర్ రోడ్ మహింద్ర షోరూం వద్దగల కాలనీలో సిసి రోడ్లు, సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి వాడా, ప్రతి గల్లి అభివృద్ధి చేసే విషయంలో కట్టుబడి ఉన్నామని అన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే ఈ వాడలకు వచ్చిన దాఖాలాలు లేవని ఎవ్వరు ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని అన్నారు.
ప్రజాపాలనలో అభివృద్ధి విషయంలో మేము అలాంటి నిర్లక్ష్యం చెయ్యమని, నలభై లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చెయ్యడమే సాక్ష్యం అని అన్నారు. ప్రతీ రోజు అభివృద్ధిలో భాగాస్వామ్యం కావడమే మా దినచర్య అని తెలియజేశారు, కాలని వాసులందరు సహకరించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.