07-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆస్పత్రిలో 25 ఏళ్ల యువకుడికి ఆయన చిన్నాన్న ఇచ్చిన కిడ్నీని విజయవంతంగా మార్చారు. తల్లిదండ్రుల్లో ఒకరికి పక్షవాతం, మరొకరికి గుండెకు బైపాస్ శస్త్రచికిత్స జరిగాయి. కుమారుడికి వారిద్దరూ కిడ్నీ ఇవ్వలే ని పరిస్థితి. అలాంటి తరుణంలో ఆయన చిన్నాన్న ముందుకొచ్చారు.
చిన్నప్పటి నుంచి తన కళ్లముందే పెరిగిన ఆ యువకుడికి తాను కిడ్నీ ఇస్తానన్నారు. కోనసీమ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు.. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఉన్న ట్టుండి అతడికి తలనొప్పి, వాంతులు తరచు అవ్వడం మొదలైంది. ఏంటా అని వైద్యులకు చూపించుకుంటే సీరం క్రియాటినైన్ బాగా పెరిగిందని రక్తపరీక్షల్లో తేలింది. మరిన్ని పరీక్షల అనంతరం.. అతడికి దీర్ఘకాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉందని తెలిసింది.
దాంతో అతడు నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులను సంప్రదిం చాడు. అతడికి చికిత్స అందించి, కిడ్నీ మార్పి డి చేసిన సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ‘యువకుడి చిన్నాన్న నుంచి లాపరోస్కొపిక్ పద్ధతిలో కిడ్నీ సేకరించి, దాన్ని యువకుడికి అమర్చాం అని డాక్టర్ శ్రీకాంత్ వివరించారు.