calender_icon.png 7 December, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు..

06-12-2025 11:28:05 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు 108 వాహన సిబ్బంది తెలిపారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, తాడికల్ శివారులో ఎల్లమ్మ గుడి దగ్గర జాతీయ రహదారిపై ఓ లారీని ద్విచక్ర వాహనదారులు ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఒక కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వరంగల్ జిల్లా అబ్బాయి కుంట లేబర్ కాలనీకి చెందిన కొండ బత్తుల అనిల్ కుమార్, అతని కుమారుడు కొండ బత్తుల ప్రదీప్ కు తీవ్ర గాయాలు కాగా 108 వాహనానికి సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కోసం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనిల్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ లోని ఎంజీఎంకు తరలించినట్లు 108 వాహన ఈఎంటి గూడూరు సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ ఉల్లా తెలిపారు.