7 April, 2026 | 3:04 AM

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం

07-04-2026 12:32 AM

సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్నగర్ ఏప్రిల్ 6 (విజయక్రాంతి): నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  తెలిపారు. నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా చేయడమే తన కర్తవ్యం అని అన్నారు. ఉప్పరిగడ్డ గ్రామం లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు షాద్ నగర్  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకు స్థాపన చేసారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఈ సందర్బంగా ఉప్పరిగడ్డ గ్రామ అభివృద్ధి కి ఏమి కావాలన్న చేస్తానని గ్రామ సర్పంచ్ చందు నాయక్ చాలా మంచి నాయకుడని నాకు అత్యంత సన్నిహితుడని గ్రామం అభివృద్ధి గురించే ఎప్పుడు నా ముందు చెబుతుంటాడని అతడు ఏమి అడిగిన నేను చేస్తానని అన్నారు. ఇప్పటికే గ్రామ అభివృద్ధి కొరకు నిధులు ఇచ్చామని ఇంకా కావాలంటే ఇస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ చందు నాయక్, గ్రామ ఉపసర్పంచ్ శ్రీలత తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ నాయక్,అయ్యవారిపల్లి సర్పంచ్ గోపాల్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.