మామిడి సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 6: మామిడి సీజన్‌లో మార్కెట్‌లో అన్నీ రకాల తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. మామిడి సీజన్ దృష్టిలో పెట్టికుని.. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం బాటసింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించారు. మామిడి క్రయ విక్రయాలను అధికారులతో కలసి పరిశీలించారు. మార్కెట్‌కు వచ్చే రైతులను కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని పాలకవర్గం హెచ్చరించింది. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..
గత ఏడాది 1,47,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఈ సారి పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. సీజన్‌లో రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తుందన్నారు. అధిక కమీషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వాకున్నా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మామిడి పండ్లు పండడానికి ప్రభుత్వ అనుమతిచ్చిన ఇథనాల్‌నే వాడాలని.. ఇథనాల్‌ను అధిక మొతాదులో ఉపయోగించాలని సూచించారు.
అధికంగా ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చెపిస్తామన్నారు. ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తూ.. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, మచ్చేందర్‌రెడ్డి, గణేశ్ నాయక్, నరసింహ, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.




