మా ఎమ్మెల్యే కనిపించడం లేదు
- గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
గజ్వేల్, జూన్ 15: గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కనబడడం లేదని బీజేపీ నాయకులు శనివారం గజ్వేల్ పోలీసు స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు గడిచినా నియోజక వర్గంలోని ప్రజలకు కనబడడం లేదని.. ఆయన ఫొటో, వివరాలతో కూడిన ఫ్లకా ర్డులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుం చి ఇందిరా పార్కు చౌరస్తా వరకు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. క్యాంపు కార్యాలయంతో పాటు పలుచోట్ల ఎమ్మెల్యే కనబడడం లేదంటూ పోస్టర్లు అంటించారు. బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ బండారు మహేశ్, మండలా ధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, నాయకులు పెండ్యాల శ్రీనివాస్, నాగు ముదిరాజ్, చాడ కిరణ్‌కుమార్ రెడ్డి, తోకల లక్ష్మారెడ్డి, అయిల మహేందర్, ఉమ, సరిత, మమత తదితరులు పాల్గొన్నారు.






