17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మా బాధ వర్ణనాతీతం

29-05-2025 03:09 AM

- పనామా సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 

- నాలుగు దశాబ్దాల్లో భారత్‌లో అనేక ఉగ్రదాడులు

- నేరస్థులను గుర్తించి శిక్షించేందుకు సాయం చేయండి

- కార్గిల్‌లో చేయలేనిది సర్జికల్ స్ట్రుక్స్‌తో నిరూపించాం

- ‘ఆపరేషన్ సిందూర్’ మెచ్చుకుంటూ ప్రధానిపై ప్రశంసలు

- శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం

పనామా, మే 28: గత నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను ఎదు ర్కొందని, ఈ బాధను, నష్టాన్ని భరిస్తూ అంతర్జాతీయ వేదికపై మాట్లాడడం కష్టతరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు.

తమ బాధ వర్ణణాతీతమని.. భారత్‌పై జరుగుతున్న దాడులను చూసి అందుకు కారణమైన నేరస్థులను గుర్తించి శిక్షించేందుకు తమకు సాయం చేయాలని బుధవారం పనామా వేదికగా శిశిథరూర్ వ్యాఖ్యానించారు.

పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రతినిధి బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని దౌత్యబృందం పనా మాలో పర్యటిస్తోంది. శశిథరూర్ మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాలుగా భారత్ అనే క ఉగ్రదాడులను ఎదుర్కొంది. ఈ బాధను, నష్టాన్ని భరిస్తూ వచ్చాం.

అంతర్జాతీయ వేదికపై మాట్లాడడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోం ది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీ య సరిహద్దును దాటి పాక్ ఉగ్రవాద మూలాలను నాశనం చేశాం. 2015 తర్వాత భారత్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 2015 సెప్టెంబర్‌లో ఉరిపై ఉగ్రదాడి జరిగింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం తొలిసారి నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద స్థావరంపై సర్జికల్ స్ట్రుక్ నిర్వహించింది. గతంలో ఏ ప్రభుత్వం ఇది చేయలేకపోయిం ది.

కార్గిల్ యుద్ధ సమయంలోనూ చేయలేకపోయాం. కానీ ఉరి విషయంలో సర్జికల్ స్ట్రుక్స్ నిర్వహించాం. 2019 జనవరిలో పుల్వామాపై దాడి జరిగింది. ఈసారి మనం నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లోని ఉగ్రవాద ప్రధాన కార్యాలయంపై దాడి చేశాం. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్‌తో’ ఆ రెండింటిని మించిపో యాం. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దును దాటడమే కాకుండా పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేశాం. ఈ ఆపరేషన్ అత్యవసరం.

మహిళల సిందూరాన్ని తుడిచివేసిన వారిని వదిలిపెట్టొద్దని భారత్ నిర్ణయించుకుంది’ అని అన్నారు. అనంతరం 2008 ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించిన శశిథరూర్.. ‘మన వద్ద అన్ని ఆధారాలున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారి ప్రాణత్యాగంతో పట్టుకున్నాం.

అతడిని, పాకిస్థాన్ లోని అతడి ఇంటిని, చిరునామాను, గ్రామా న్ని గుర్తించారు. దాడులు జరుగుతున్నప్పుడే అన్ని ఆధారాలు సేకరించి నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఏం జరిగింది? ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒక్కరినైనా విచారించారా, శిక్షించారా? అంటే లేదనే చెప్పాలి. పాక్ మాత్రం దురదృష్టవశాత్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఎంచు కుంది’ అని వివరించారు.

శశిథరూర్‌పై అధిష్ఠానం ఆగ్రహం

అయితే గత కొన్ని రోజులుగా ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా పనామా వేదికగా పాక్ చేస్తున్న ఉగ్రవాదంపై విరుచుకుపడుతూనే పరోక్షంగా మోదీ ప్రభు త్వాన్ని ప్రశంలతో ముంచెత్తారు. యూపీఏ హయాంలో చేయలేనిది ఎన్డీయే హయాంలో జరుగుతుందని పేర్కొన్న శశిథరూర్ వ్యాఖ్యలపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీకి రాజప్రతినిధిగా మారారని చురకలంటించారు. బీజేపీ నేతలు కూడా చెప్పని విధంగా ఆయన మోదీకి, కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయో ఆయనకు తెలుసా? భారత సాయుధ బల గాల ఘనతను కేంద్రం తమ ఖాతాలో వేసుకున్న విషయాన్ని ఆయన గుర్తించేలేకపోయారా అని ప్రశ్నించారు.