మా పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది
- బడుగుల ఆత్మగౌరవ పోరాటమే టీఆర్పీ సిద్ధాంతం
పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
టీఆర్పీలో చేరిన మియాపూర్ ప్రశాంత్‌నగర్‌కి చెందిన పలువురు
రంగారెడ్డి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): రాజ్యాధికారమే లక్ష్యం -జన చైతన్యమే మార్గం అనే నినాదంతో తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు చేరారు. మి యాపూర్ ప్రశాంత్ నగర్ ప్రాంతానికి చెంది న వివిధ పార్టీల ముఖ్య నాయకులు, మహి ళా నేతలు ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు.
పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బందారపు నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహి ళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మిఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటమే టీఆర్పీ సిద్ధాంతం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం మేము చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఇతర పార్టీలను వీడి మా వెంటే నడుస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రవాహం మరింత ఉధృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు బస్తీ నాయకులు అధ్యక్షులు యాది, ఉపాధ్యక్షుడు రాములమ్మ, లచ్చప్ప, తిమ్మయ్య, స్వామి, చిన్న తెల్లప్ప, చంద్రకాంత్ కార్యకర్తలు తదితరులున్నారు.




