ఇంటర్ ఫలితాల్లో వైబ్రంట్ ప్రభంజనం
సత్తా చాటిన జూనియర్ కాలేజీ విద్యార్థులు
వరంగల్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్మిడియట్ ఫలితాలలో వైబ్రంట్ జూనియర్ కాలేజి విద్యార్థులు ప్రభంజనం సృష్టిం చారని వైబ్రెంట్ జూనియర్ కాలేజి చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరెక్టర్ సీహెచ్ రాజేందర్‌రెడ్డిలు సంయుక్తంగా తెలియజేశారు.ఈ సందర్భంగా జూనియర్ కాలేజి డైరెక్టర్ సీహెచ్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని వరంగల్‌లో స్థాపించామన్నారు.
ఆదివారం తెలంగాణ విడుదల చేసిన మార్చి-2026 ఇంటర్మిడియట్ ఫలితాలలో వైబ్రెంట్ జూనియర్ కాలేజి విద్యార్థు లు అత్యధికంగా ప్రథమ ఫలితాలు సాధించారని, ఇలాంటి ఫలితాలు మొదటి బ్యాచ్లో నే సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. వైబ్రెంట్ అకాడమి మొదటి నుండి జేఇఇ మేయిన్స్, అడ్వాన్స్, నీట్, ఇంటర్మిడియట్ లలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు.
గ్రామీ ణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన అణిముత్యాలుగా తయారుచేసి రాష్ట్ర స్థాయిలోనే అత్యధి కమైన ప్రథమ ఫలితాలు ఇంటర్మిడియట్లో సాధించమన్నారు.తదనంతరం ఎంపీసీ మొదటి సంవత్సరంలో అల్లపురం రిషీకీర్తణ్- 263810 1464 (468/470), మాలోతు వెన్నెల-2638 103728 (468/ 470), కంచర్ల పౌర్ణమి -2638104410 (468/470), బైపిసిలో గూగులోతు అరుంధతి- 263810 7141 (437/440), బానోతు అక్షయ -2638107 463 (437/440), పెరుక యోగిత -2638 107433 (436/440) వీరితో పాటుగా మొదటి సంవత్సరం ఎంపీసీలో 48 మంది విద్యార్థులు 460/470 మార్కులకు పైగా, బైపీసీలో 17 మంది విద్యార్థులు 430/ 440 మార్కులకు పైగా సాధించారు.
రెండవ సంవత్సరం ఎంపీసీలో కందికొండ రంజిత్కుమార్- 263820 4794 (993/1000) పోషా ల శ్రీమహర్ష -263820 4171 (992/1000), ముసుకు సోనూప్రియ -2638206204 (991/1000), 263820 4800 (991/ 1000), గోనె జాహ్నవి -2638205749 (982/1000), కునుసోతు సాయి-263820 4731 (981/1000) వీరితో పాటుగా రెండవ సంవత్సరంలో 14 మంది విద్యార్థులు 985/ 1000 పైగా సాధించిన విద్యార్థులను అభినందించారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకుల తో నిరంతర పర్యవేక్షణ యోగా, ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగతమైన శ్రద్ద తీసుకోవడం వలనే ఈ ఫలితాలు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడా మి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్, అడ్మిని స్ట్రేష న్ హెడ్ జి. రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యా పకులు తదితరులు పాల్గొన్నారు.




