5 July, 2026 | 12:59 PM

మన ఊరు మన అంగన్వాడి కార్యక్రమం

12-06-2025 11:01 PM

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల నారాయణగూడెం గ్రామంలో అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు  సిబ్బంది ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ సూపర్వైజర్ బెజవాడ సరిత మాట్లాడుతూ... జూన్ 12న అంగన్వాడి  పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున  అంగనవాడి కేంద్రంలో చిన్నారులకు చదువు నేర్పించడంతోపాటు పౌష్టిక ఆహారాన్ని అందించి రుచికరమైన మధ్యాహ్నం భోజనంతో సరైన విద్యాబోధనం అందించామన్నారు.

కాబట్టి చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడి పాఠశాలలకు తమ చిన్నారులను పంపించు అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారికి  చిన్నారుల తల్లికి అందిస్తున్న పౌష్టిక ఆహార పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ రజిత అంగన్వాడి టీచర్స్ హెల్త్ ఏఎన్ఎం పావని ఆశాలు ప్రైమరీ స్కూల్ టీచర్స్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.