calender_icon.png 26 July, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

23-07-2025 12:00:00 AM

సిద్దిపేట క్రైమ్, జూలై 22 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  తమను విధుల నుంచి తొలగిస్తే, కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ శాఖల్లోకి బదిలాయించి, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని కోరారు. మంగళవారం సిద్దిపేటకు వచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.

మంత్రిని కలిసిన వారిలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పుల్లగుల్ల రాజిరెడ్డి, రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు పొన్నమల్ల యాదగిరి సిద్దిపేట డివిజన్ అధ్యక్షులు పోతుల నర్సింలు, సభ్యులు ఉపేంద్ర, సతీష్, రవి,అజీమ్,నరేష్, బిక్షపతి, కపిల్, రవి కేశవరాజ్, సంతోష్ తదితరులు ఉన్నారు.