20 July, 2026 | 9:19 PM

కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి

20-07-2026 02:46 AM
  1. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు 
  2. దేవని సతీష్ మాదిగ

ముషీరాబాద్, జూలై 19 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడటంపై ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవని సతీష్ మాదిగ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫి కేషన్‌లతో తాము గంగా ఉన్నామని కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాలు విసిరారు. ఆదివారం గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లు ఇచ్చి పరీక్ష పేపర్లు లీక్ చేసిన విషయాన్ని యావత్ సమాజం మర్చిపోలేదని గుర్తు చేశారు.

2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 563 గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చే సేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా దానిని కూ డా విఆర్‌ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేయగా హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరా లు తెలంగాణను పాలించి ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుం టే అడుగడుగునా అడ్డుపడడంపై మండిపడ్డారు. డిసెంబర్ ౭న ప్రజాప్రభుత్వం ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు వివిధ శాఖలలో నోటిఫికేషన్లు ఇస్తూ 30 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎక్కడ చర్చకు రమ్మన్న తాము సిద్ధమని కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.