24 June, 2026 | 3:09 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

పదిలో ఆక్స్ ఫర్డ్ స్కూల్ ఉత్తమ ఫలితాలు

30-04-2026 01:19 AM

ముషీరాబాద్,ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్(ఓజిఎస్) మార్చి 2026లో నిర్వహించిన ఎస్‌ఎస్సీ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేసిందని స్కూల్ కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల టాపర్లు అరుణ్ శ్రీ సుధాంశు, సౌరభ్ రాజ్ పురోహిత్, ఇద్దరూ 91 శాతం మార్కులు సాధిం చినట్లు చెప్పారు.

అదనంగా, 2 మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా, 19 మంది విద్యార్థులు 80 శాతం నుండి 90 శాతం మధ్య మార్కులు సాధించి పాఠశాల విద్యా ప్రతిభను ప్రతిబింబించారని పేర్కొన్నారు. విద్యతో పాటు లైఫ్ సైన్సెస్, ఫైన్ ఆరట్స్, క్రీడలు, గేమ్స్ వంటి సహపాఠ్య కార్యకలాపాలపై సమాన ప్రాధాన్యత ఫలితంగానే ఈ అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు.

స్కూల్ డైరెక్టర్ ప్రార్థన మణికొండ, డీన్ రామాంజుల విద్యార్థుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమగ్ర మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతో విద్యా ప్రమాణాలను నిలబెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులలో సత్కరించి అభినందించినట్లు చెప్పారు.