30 April, 2026 | 2:47 AM

ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్లో 100% ఉత్తీర్ణత

30-04-2026 01:18 AM

ముషీరాబాద్,ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కవాడిగూడ లోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో 2026 పదవ తరగతి పరీక్షల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.  స్వర్ణలతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం వారు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 11 మంది విద్యార్థులు ’ఏ-1’ గ్రేడ్ సాధించారు. 

134 మంది విద్యార్థులు 100కు 100% ఉత్తీర్ణత సాధించినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా 10లో 100% రాణించిన విద్యార్థుల కు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు 10 పరీక్షల్లో 100కు 100% రాణించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

100% ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయులను వారి ఈ సందర్భంగా అభినందించారు. ఇదే పట్టుదలతో  విద్యార్థులు ఉన్నత చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.