కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా పడాల రాములు
03-07-2026 12:12 AM
చేవెళ్ళ జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుల ఎన్నిక చేసింది. ఇందులో భాగంగా చేవెళ్ళ మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన పడాల రాములు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షునిగా కొనసాగిన నేపథ్యంలో పార్టీకి ఆయన చేసిన సేవల గుర్తించి తిరిగి ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేసింది.
ఈ సందర్బంగా పడాల రాములు(రాంచంద్రయ్య ) మాట్లాడుతూ...అధిష్టానం సేవలు గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెండవ సారి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉండన్నాడు. నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీ పెద్దలకు సహకరించిన నాయకులకు పడాల కృతజ్ఞతలు తెలిపారు.






