24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

వరి, మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలి

23-04-2026 01:54 AM

సీపీఎం, రైతు సంఘం తహసీల్దార్‌కు వినతి

కూసుమంచి, ఏప్రిల్ 22(విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద నెలలు గడుస్తున్న వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు మాట్లాడుతూ...

రైతులు పండించిన పంట ఐకెపి కేంద్రాల వద్ద ఉంచి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వెంటనే మొక్కజొన్న వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం పాలే డివిజన్ అధ్యక్షులు బిక్కసాని గంగాధర్, చేగోమ్మ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు జగన్ మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, కర్ణబాబు, కృష్ణంరాజు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.