22 May, 2026 | 1:35 AM

ఐకేపీ సెంటర్‌లో వడ్ల కొనుగోలు

22-05-2026 12:33 AM
  1. సక్రమమా...? అక్రమమా..?
  2. రైతు శ్రీనివాస్ ఆగ్రహం
  3. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి

చందుర్తి, మే 21 ( విజయక్రాంతి ):చందుర్తి మండలం లోని అనంత పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతు ఐతం శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ, నా వడ్లు మ్యాచర్ వచ్చిన తర్వాత నాకు సీరియల్ నెంబర్ 21 ఇచ్చి, ఇరువై రోజులు గడుస్తుంది ఇంకా కొనుగోలు చేయరా అని ఐకెపి వారిని అడిగితే మా దగ్గర గన్ని సంచులు లేవు అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు, అదే ఐకెపి కొనుగోలు సెంటర్లో ఇరువై నాలుగు సీరియల్ నెంబర్ కొనుగోలు చేస్తున్నారని, 24 నెంబర్ రైతుకు ఎవరిచ్చారని అడిగితే శ్రీవర్ధన్ ఇచ్చాడు, అని ఐకెపి వారు సమాధానం చెబుతున్నారు.

ఈ శ్రీవర్ధన్ ఎవరు..? ఐకెపి సెంటర్ కి, శ్రీ వర్ధన్ కు సంబంధం ఏంటి? (1500) వందల గన్నీ సంచులు తెప్పించి రైతులకు పంపిణి చేసాడని రైతు ఆరోపించాడు. ఇంకా మూడు వేల (3000) గన్ని సంచులు తెప్పిస్తానని శ్రీ వర్ధన్ చెప్తున్నాడని, రైతు ఆగ్రహంతో ఐకేపీ వారు కొనుగోలు చేస్తున్నారా,లేక సోసైటీ వారు కొనుగోలు చేస్తున్నారా అని రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ను వివరణ కోరగా ఈ సంవత్సరం చందుర్తి మండలంలోని సొసైటీ ద్వారా వడ్లు కొనుగోలు చేయడం లేదు, మా సొసైటీ నుండి ఎలాంటి గన్ని సంచులు ఎవరికి ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయమై చందుర్తి ఎమ్మార్వో భూపతి కి సదరు రైతు వినతి పత్రం అందించగా, దీనిపైన ఎమ్మార్వో భూపతి స్పందించి ఐకెపి ఏపిఎం కల్పనతో మాట్లాడి, అనంతపల్లి ఐకెపి సెంటర్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.