ఐకెపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామ సర్పంచ్ సంజీవరావు, మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైతులు విక్రయించి లాభదారకరమైన మద్దతు ధర పొందాలని తెలిపారు. పూర్తి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఏ రకం ధాన్యం ధర క్వింటాల్కు 2389, బీ,,రకం దాన్యం ధర క్వింటాల్కు 2369 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవరావు, మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, వివో అధ్యక్షులు పి.లక్ష్మి, ఏఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్లు నర్సాగౌడ్, గోపాల్ గౌడ్, గ్రామ అధ్యక్షులు కిరణ్, నాయకులు, మెంబర్లు ఐకెపి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.




