5 April, 2026 | 8:51 PM

ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

05-04-2026 04:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద,బంజారాతండా గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మండల ఇన్చార్జ్ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాల్తుమ్మెద గ్రామంలో గల స్నేహ వివో ఆధ్వర్యంలో నిర్వహించే అబేద్ నగర్ ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, వివో అధ్యక్షురాలు ఏంబరీ సత్యమ్మ కొబ్బరికాయ కొట్టి కాంటా ప్రారంభించారు.

అలాగే బంజారా తండా పరిధిలో విజయసాయి వివో ఆధ్వర్యంలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రంను గ్రామ సర్పంచ్ సురేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్లు మండల ఇన్చార్జి ఏపిఎం రామనారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ...రైతులు యాసంగిలో ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని బయట దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని అమ్ముకొని లబ్ధిపొందాలని సూచించారు.

పూర్తి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వరి ధాన్యం కొనుగోలు అయిన  48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ఉపసర్పంచులు శివకుమార్, భూమయ్య,వార్డు మెంబర్లు, సీసీలు,వివోఏలు,బుక్కు కీపర్స్,రైతులు,నాయకులు పాల్గొన్నారు.