19 June, 2026 | 3:28 AM

కోనరావుపేట ప్యాక్స్ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తరలింపు వేగవంతం

19-06-2026 02:06 AM

బీహార్ కూలీలతో యుద్ధ ప్రాతిపదికన పనులు

కోనరావుపేట, జూన్ 18 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీగా ధాన్యం నిల్వ ఉండటంతో వాటి తరలింపు పనులను అధికారులు వేగవంతం చేశారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 25 రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రం పూర్తిగా ఖాళీ కాకపోవడంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎస్‌ఓ, డీఎం, డీసీఓ తహసీల్దార్,లు కొనుగోలు కేంద్రాన్ని సం దర్శించి పరిస్థితిని పరిశీలించారు.

కేంద్రంలో ధాన్యం కుప్పలు అధికంగా ఉండటంతో, వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న బీహా ర్కు చెందిన కూలీలను ప్రత్యేకంగా తీసుకువచ్చి పనులు వేగవంతం చేశారు.ఈ సంద ర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య మా ట్లాడుతూ, ప్రతి సంవత్సరం సుమారు లక్ష క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు జరిగేదని, అయితే ఈ ఏడాది రైతులకు అధిక దిగుబడి రావడంతో కొనుగోళ్లు లక్షా 50 వేల క్వింటాళ్లకు చేరుకున్నాయని తెలిపారు. స్థానిక హమాలీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రం పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు.

రైతులు వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని, డీఎస్‌ఓ, డీఎం, డీసీఓ లు వారే బీహార్ కూలీలను తెపించి రెండు రోజుల్లో కేంద్రాన్ని పూర్తిగా ఖాళీ చేయనున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి 12 గంటల వరకు 15వేల నుంచి 20వేల ధాన్యం బస్తాలను తూకం వేస్తూ రైతులకు సహకరించిన సిబ్బంది, హమాలీలు, అధికారులు మరియు సంబంధిత ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.