calender_icon.png 3 December, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న మహాశక్తి దేవాలయంలో పడిపూజ

03-12-2025 01:17:33 AM

పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ క్రైం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నగరంలోని మహిమాన్విత దివ్య క్షేత్రం మహాశక్తి ఆలయంలో ఈనెల 6న అయ్యప్ప స్వామి పడిపూజ ను నిర్వహించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాయంత్రం 6 గంటలకు జరిగే పడిపూజ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. పడిపూజ అనంతరం స్వాములకు అల్పాహారం అందించడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పడిపూజ మహోత్సవ వేడుకకు హిందూ బంధువులందరూ తరలివచ్చి ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులుకోరారు.